యూరప్‌లోనే కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువ: WHO
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కోవిడ్ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలోనమోదైన కోవిడ్ మరణాల్లో 5శాతం మేర యూరప్ ఖండంలోనే పెరుగుదల కనిపించినట్టు వెల్లడించింది. అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6శాతం మేర పెరిగాయని పేర్కొం ది. యూరప్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు స్థిరంగా ఉండటమో, తగ్గడమో జరిగిందని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50వేల మరణాలు సంభవించినట్టు వారాంతపు రిపోర్టులో పేర్కొంది. అలాగే..3.3 లక్షల కొత్త కేసులు నమోదు కాగా వాటిలో 2.1 మిలియన్ కేసులు యూరప్‌లోనే వచ్చనట్టు పేర్కొంది. జూలై నుంచి ఆఫ్రికా, మద్యప్రాచ్యం ఆగ్నేయాసియాలో ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పశ్చిమ యూరప్‌లో 60శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా.. తూర్పు ప్రాంతంలో మాత్రం కేవలం సగం మంది మాత్రమే టీకా పొందారాని తెలిపింది. వ్యాక్సిన్‌పై అపోహాలు తొల గించడం, పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ను వేయించుకునేలా అధికారు లు శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారికి యూరప్ కేంద్రంగా మారిం దని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది జనవరి నాటికి మరో ఐదు లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో అధికారులు హెచ్చరించారు. కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని యూకే నిర్ణయించగా.. ఆస్ట్రియా, నెదర్లాండ్స్ సహా పలు దేశాలు మాత్రం లాక్‌డౌన్ తరహాలో కొన్ని చర్యలను మరోసారి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!