అమెరికా నిర్ణయంతో లాభాలు ఆర్జిస్తున్న తాలిబన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడైతే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి తాలిబన్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అతి తక్కువ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నెలాఖరు వరకు ఆమెరికా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగనున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్లు వివిధ మార్గాల ద్వారా భారీ ఆదాయాన్న సమకూర్చుకున్నారు. ఇప్పుడు అమెరికా దళాలు తప్పుకుంటే తాలిబన్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తాలిబన్లకు అత్యధికంగా మాదకద్రవ్యాల రవాణా, ఉత్పత్తి నుంచే వస్తున్నది. వీరి ఆదాయంలో సింహభాగం ఈ రకంగానే వస్తున్నది. ప్రపంచంలో నాలుగింట మూడొంతున నల్లమందు ఆఫ్ఘన్ నుంచే ఎగుమతి అవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాలిబన్ల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఈ పంటను పండిస్తున్నారు. అక్కడి నుంచి అక్రమంగా ఈ మత్తుమందును వివిధ రూపాల్లోకి మార్చి ఎగుమతులు చేసి భారీగా ఆర్జిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ధీటుగా తాలిబన్ల సంపాద ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. ఇలా సంపాదించిన డబ్బుతో ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆఫ్ఘన్ మొత్తం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఇంకెంత ఆదాయం ఆర్జిస్తారో చూడాలి. లక్షకోట్ల విలువైన గనులు ఆఫ్ఘన్లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చైనా కన్నేసింది. గతంలోనే ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సహకరిస్తామని చైనా చెప్పడం వెనుక ఉద్దేశం ఈ గనుల ఒప్పందాలే అని చెబుతున్నారు.
Read: ఆగస్టు 23, సోమవారం దినఫలాలు…
Also Read
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్!
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
- Tags
- Afghanistan
- Taliban
- USA
తాజావార్తలు
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
-
Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
-
Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!