Israel-Hamas conflict: స్వదేశంలో ఉంటూ శత్రు దేశాలని సమర్ధించే దేశ ద్రోహులను చటం శిక్షిస్తుంది. ఇలాంటి దేశద్రోహులు ప్రపంచ వ్యాప్తంగా చాలామందే ఉన్నారు. తాజాగా ఓ నటి స్వదేశం పై దాడి చేసిన శత్రు దేశానికి మద్దతు ఇచ్చింది. దీనితో ఆ నటిని ఆ దేశంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళ్తే.. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అరబ్ ఇజ్రాయిల్ నటి మైసా అబ్దెల్ హదీ హామాస్ కి సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ.. అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెయిల్ పైన హమాస్ దాడిచేసే సమయంలో గాజా స్ట్రిప్ మరియు ఇజ్రాయెల్ మధ్య కంచెను బుల్డోజర్ తో బద్దలు కొడుతున్న ఫోటోనో సోషల్ మీడియా వేదికగా Ms హదీ పోస్ట్ చేశారు. అలానే దానికి 1989 వరకు జర్మనీని విభజించిన బెర్లిన్ గోడ పతనానికి సూచనగా “లెట్స్ గో బెర్లిన్-స్టైల్” అని ఆమె ఒక క్యాప్షన్‌లో రాసింది.
Read also:Mallikarjun Kharge: ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దే గెలుపు.. బీజేపీకి అంత సీన్ లేదు..
అలానే హమాస్ ఉగ్రవాదులు బంధించిన 85 ఏళ్ల వృద్ధురాలు యఫ్ఫా అదర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వాటికి నవ్వుతున్న ఎమోజిని జోడించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించింది అనే అనుమానంతో నటి మైసా అబ్దెల్ హదీని అరెస్ట్ చేశామని వెల్లడించారు. కాగా 37 ఏళ్ల నటి వివిధ ఇజ్రాయెలీ షోలలో, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ “వరల్డ్ వార్ Z” మరియు ఇటీవల, బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ “బాగ్దాద్ సెంట్రల్”లో నటించింది. ఈ ఘటన పైన ఆమె స్నేహితుడు అలానే ఇజ్రాయెలీ సహనటుడు అయినటువంటి ఆఫర్ షెచ్టర్ కూడా సోషల్ మీడియా వేదికగా హాది ని నిందిచాడు.. ఆయన ఒక సోషల్పో మీడియా పోస్ట్‌లో.. నాకు నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది.. ఇక్కడ ఉంటూ హమాస్ కు మద్దతు ఇచ్చినదుకు సిగ్గుపడాలి మీరు.. మీరు నజరేత్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ మా టీవీ షోల్లో, చిత్రాల్లో నటిస్తూ మమ్మల్నే వెన్నుపోటు పొడిచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.