Site icon NTV Telugu

Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీపై మొసాద్, సీఐఏ గురి..

Mojtaba Khamenei

Mojtaba Khamenei

Mojtaba Khamenei: ఇజ్రాయిల్, అమెరికా దాడి చేసిన తొలి రోజే ఇరాన్‌ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశాయి. అయితే, ఇప్పుడు కొత్తగా ఇరాన్ అత్యున్నత నేతగా ఎన్నికైన అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ కొసం ఇజ్రాయిల్, అమెరికా గూఢచార సంస్థలు మొసాద్, సీఐఏలు ఇరాన్ వ్యాప్తంగా వెతుకున్నాయి. ఈ దాడుల్లో మొజ్తబా ఖమేనీ భార్య, కుమారుడు కూడా మరణించారు. అయితే, మార్చి 09న కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఒకటి రెండు సార్లు ఆయన ప్రకటనల్ని ఇరాన్ స్టేట్ మీడియా చదివింది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు సీఐఏ, మొసాద్ సంస్థలు ఇప్పుడు మొజ్తబా గురించి వెతుకుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పర్షియన్ నూతన సంవత్సరం ‘‘నౌరూజ్’’ సమయంలో దేశ ప్రజలకు సందేశం ఇస్తాడని అంతా ఎదురుచూశారు. అయితే, ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటన మాత్రమే చేశారు. దీంతో మొజ్తబా ఆరోగ్యం, అతడి అదృశ్యం గురించి మిస్టరీ తీవ్రమవుతోంది.

Read Also: Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..

ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్ అధికారులు అతనితో సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం వంటి ఆధారాలను బట్టి చూస్తే, మొజ్తబా ఇంకా సజీవంగా ఉన్నాడని అమెరికా, ఇజ్రాయిల్ గూఢచార సంస్థల వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. ఇది అత్యంత విచిత్రంగా ఉంది. ఒక మరణించిన వ్యక్తిని సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవడానికి ఇరాన్ వారు ఇంత శ్రమపడి ఉంటారని మేము అనుకోవడం లేదు; కానీ అదే సమయంలో, అతను నిజంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తున్నాడనడానికి కూడా మా వద్ద ఎటువంటి రుజువు లేదు,” అని సీఐఏ అధికారులు చెబుతున్నారు.

మొజ్తాబా టెలిగ్రామ్ ఛానెల్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక రాతపూర్వక సందేశాన్ని, తన కొన్ని ఫోటోలతో పాటు ప్రచురించిన తర్వాత, ఆ ఫోటోలు ఇటీవలివా కాదా అని సీఐఏ తెలుసుకోవడానికి గూఢచార సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ నౌరూజ్ సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Exit mobile version