గోడలకు చెవులుంటాయని.. గూఢచారులుంటారని పెద్దలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇక నేటి ప్రపంచం అప్‌డేట్ టెక్నాలజీలో ఉంది. రాతియుగం నుంచి ఏఐ టెక్నాలజీకి వచ్చాం. ఏం జరిగినా క్షణాల్లో బయటకు వచ్చే అత్యంత టెక్నాలజీలో ఉన్నాం. ఈ విషయం కొంచెం తెలివి ఉన్నవాళ్లకైనా అర్థమవుతుంటుంది. అలాంటిది ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకులకు ఇంకెంత జ్ఞానం ఉండాలి. ఇదంతా ఎందుకంటారా? ఒక్క ఫోన్ కాల్ సంభాషణ ఏకంగా ప్రధాని పదవికే గండం ఎదురయ్యేలా ఉంది. ఇంతకీ ఆ ప్రధాని ఎవరు? ఏంటో తెలియాలంటే వార్త చదవండి.

పేటోంగ్టార్న్ షినవత్రా(37) థాయ్‌లాండ్ యువ ప్రధాని. 10 నెలల క్రితమే అధికారంలోకి వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆమెకు ఏం కష్టం వచ్చిందో.. ఏమో తెలియదు గానీ.. పొరుగు దేశం కంబోడియాకు చెందిన మాజీ నేత హున్ సేన్‌కు షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఫోన్ పలకరించి.. అనంతరం థాయ్‌లాండ్ రాజకీయ పరిస్థితులను వివరించారు. అటు తర్వాత థాయ్‌లాండ్ ఆర్మీ చీఫ్ పానా క్లావ్‌ప్లోడ్‌టూక్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సంభాషణకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో తాజాగా లీక్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పక్షం తప్పుకుంది. దేశ సమాచారాన్ని ఇతరులతో ఎలా పంచుకుంటారంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ పెరిగింది. దీంతో ఆమె.. పొరుగు దేశానికి చెందిన మాజీ నేతతో మాట్లాడిన సంభాషణ పట్ల ఆమె క్షమాపణ చెప్పింది. అయినా కూడా నిరసనలు తగ్గలేదు. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కఫోన్ కాల్.. పదని పదవికే గండం తెచ్చి పెట్టింది. పదవిలోకి వచ్చి 10 నెలలే అయింది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది. ఇంతలోనే ఫోన్ కాల్ కష్టాలు కొని తెచ్చిపెట్టింది.
ఇది కూడా చదవండి: Gujrat: ప్రమాదంలో చనిపోయిన కొడుకు.. ఇష్టమైన బైక్‌ను అతనితో పాటు పాతిపెట్టిన కుటుంబం
షినావత్రా.. బిలియనీర్, మాజీ ప్రధాని థాక్సిన్ షినావత్రా కుమార్తె. పార్లమెంట్‌లో 495 మంది సభ్యులున్నారు. సంకీర్ణంతో షినావత్రా ప్రభుత్వం ఏర్పడింది. ఫోన్ కాల్ లీక్ అవ్వడంతో ప్రధాన మద్దతు పక్షం విత్‌డ్రా అయింది. 69 మంది ఎంపీలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటు మొదలైంది. దీంతో షినావత్రా పదవి నుంచి దిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలు జరిగి రెండేళ్లైంది. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతే.. తిరిగి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Bollywood : బాలీవుడ్‌ను హవా సాగిస్తున్న సీనియర్ భామలు