US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- ‘‘ఇది ఇండియా కాదు’’
- టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- మండిపడుతున్న భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టెక్సాస్ గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కెల్లీ స్మిత్ అనే మహిళ.. భారతదేశ సంస్కృతిపై సంచలన వ్యా్ఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారతీయ సమాజాన్ని అవమానించేలా మాట్లాడిందంటూ భారతీయులు మండిపడుతున్నారు.
కెల్లీ స్మిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఏఐ సాయంతో రూపొందించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి హిందూ దేవాలయంలో ఉన్నట్లుగా కనిపించింది. ఆ పోస్ట్‌లో ‘‘భారతదేశం నుంచి వచ్చిన వారంతా తమను తాము అమెరికన్లుగానే చెప్పుకుంటున్నారు కాబట్టి.. నేను కూడా భారతీయురాలిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొత్త పేరు ‘ప్రియా’. అయితే.. నేను గుడిలో కూడా హాంబర్గర్లు తింటూ.. పాదాలకు బూట్లు ధరించే ఉంటాను. ఎందుకంటే నా టెక్సాస్ సంస్కృతిని నేను వదులుకోలేను. మీ అందరిలాగే నేను కూడా పూర్తిస్థాయి భారతీయురాలినే. నా కొత్త పేరే దానికి నిదర్శనం. నిజానికి మనమందరం భారతీయులుగా మారిపోయి.. గుడిలోనే కొన్ని స్టీక్స్ (Steaks) కాల్చుకుని తినాలి. ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చింది.
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
ఈ పోస్టుపై భారతీయులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని.. భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకుందని విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలపై స్పందించిన కెల్లీ స్మిత్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా భారతీయులపై మరిన్ని ఆరోపణలు చేసింది. ‘‘బర్గర్లు గ్రిల్ చేస్తున్న ఫొటోకే మీరు ఇంత బాధపడుతున్నారు. కానీ టెక్సాస్ సంస్కృతిని గౌరవించకుండా మీరు నిజ జీవితంలో చేస్తున్న పనులు మాకు ఎంత బాధ కలిగిస్తాయో ఊహించండి. సరస్సుల్లో పాలు, పండ్లు, విగ్రహాలు వేయడం మాకు అవమానంగా అనిపిస్తుంది. ప్రతి షాపింగ్ సెంటర్‌లో ఇండియన్ స్టోర్లు పెరుగుతున్నాయి. ఇది ఇండియా కాదు.. టెక్సాస్’’. అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
కెల్లీ స్మిత్ తనను తాను టెక్సాస్‌లోని సీడర్ హిల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. గవర్నర్ ఎన్నికల్లో రైట్-ఇన్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతోంది. అంటే ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై స్వయంగా ఆమె పేరు రాయాల్సి ఉంటుంది. ఆమె ప్రచారానికి ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ఆర్థిక మద్దతు లభించినట్లు సమాచారం. ఇక ఆమె ఫండ్‌రైజింగ్ పేజీలో ‘‘టెక్సాస్ టెక్సాన్స్‌దే’’ అని పేర్కొంటూ తన ప్రచారం చాలా కఠినమైనదేనని అంగీకరించింది. అయితే విమర్శకులు మాత్రం సోషల్ మీడియాలో గుర్తింపు పొందేందుకే భారతీయులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.
Because people from India have claimed to be just as American as me, I’ve decided to become Indian. My new name is Pria, however, I will be eating hamburgers at Temple and wearing shoes because I can’t give up my Texan culture. I’m just as Indian as y’all, my new name proves it.… pic.twitter.com/MX4PBw3Nn6
— Kelly for Texas (@KellyIsRightTX) May 6, 2026
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!