గిన్నిస్ రికార్డు: 19 ఏళ్లకే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. వివరాల్లోకి వెళ్తే… బెల్జియంకు చెందిన రూథర్‌ఫర్డ్ అనే 19 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఒంటరిగా చిన్న విమానంలో ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది.
Read Also: మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర
Also Read
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
- Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
రూథర్ ఫర్డ్‌కు చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించడం కల. అందులోనూ ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్లే. దీంతో ఆమెకు ఆ కల సాకారం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది. ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టింది. బుల్లివిమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. వాస్తవానికి ఆమె ప్రపంచ యాత్ర మూడునెలల్లోనే పూర్తికావాలి. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల ఐదునెలలు పట్టింది. 155 రోజుల తర్వాత గురువారం స్వదేశంలోకి అడుగు పెట్టిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చి స్వాగతం పలకడం విశేషం.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!