ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. ఏకంగా 41 దేశాలలో ప్రయాణించి అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కేసింది. వివరాల్లోకి వెళ్తే… బెల్జియంకు చెందిన రూథర్‌ఫర్డ్ అనే 19 ఏళ్ల యువతి చిన్న వయసులోనే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఐదు నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఒంటరిగా…