Site icon NTV Telugu

Tarique Rahman: బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. మోడీ వెళ్తారా..?

Tarique Rahman

Tarique Rahman

Tarique Rahman: రెండేళ్ల అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇటీవల జరిగిన బంగ్లా ఎన్నికల్లో ‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ)’’ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మన్ బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నారు. ఫిబ్రవరి 17 సోమవారం రోజున తారిఖ్ రెహ్మాన్ తన మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారత్‌తో సహా దక్షిణాసియా దేశాధినేతల్ని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. యూనస్ పాలనతో భారత్ బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేళ మోడీ ఢాకా వెళ్తే ఇది దౌత్యపరంగా ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్‌ చేయుస్తున్న ముఠాలు

కొత్త ప్రధాని, ఆయన మంత్రివర్గం సాధారణంగా బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం, బంగభవన్‌లోని దర్బార్ హాలులో ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే, ఈసారి మాత్రం ప్రమాణస్వీకారోత్సవం జాతీయ సంసద్ భవన్‌లోని సౌత్ ప్లాజాలో జరుగుతుంది. విదేశాల నుంచి అతిథులు వస్తుండటంతో వేడుకల్ని సౌత్ ప్లాజాలో జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. ఏయే దేశాధినేతలు హాజరవుతారనే దానిపై ఆదివారం క్లారిటీ వస్తుందని చెప్పారు. 300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 209 స్థానాలు గెలుచుకుంది. మూడింట రెండువంతుల మెజారిటీని దక్కించుకుంది. ఇక జమాతే ఇస్లామీ పార్టీ 68 స్థానాలను గెలుచుకుంది.

Exit mobile version