Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
- నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం
- హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- యూనస్ నుంచి బాధ్యతలు తీసుకోనున్న తారిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రధానిగా ఈరోజు తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత మంగళవారం ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనంలో బీఎన్‌పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తారిక్ రెహమాన్‌ను ఎన్నుకోనున్నారు. అనంతరం ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తారిక్ రెహమాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read
చాలా కాలంగా ఉన్న సంప్రదాయం ప్రకారం బంగాభబన్‌లో కాకుండా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సౌత్ ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం జాతీయ సంసద్‌లోని సౌత్ ప్లాజాలో అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్‌ఎస్ వార్తా సంస్థ సోమవారం తెలిపింది. మంగళవారం ముందుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ AMM నాసిర్ ఉద్దీన్ పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు.
ఇక తారిక్ ప్రమాణస్వీకారానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బృందం వెళ్లనుంది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ కూడా ఓం బిర్లాతో పాటు ఉండనున్నారు. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు, టర్కిష్ అండర్ సెక్రటరీ బెరిస్ ఎకిన్సి, శ్రీలంక ఆరోగ్య, మాస్ మీడియా మంత్రి డాక్టర్ నలిందా జయతిస్సా హాజరు కానున్నారు.
తారిక్ రెహమాన్..
తారిక్ రెహమాన్.. దివంగత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు. 17 సంవత్సరాలు లండన్‌లో ప్రవాస జీవితం గడిపి ఇటీవలే రెండు నెలల క్రితం భార్య, కుమార్తెతో స్వదేశానికి వచ్చారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ పదవిని నిర్వహించలేదు. కుటుంబ రాజకీయ నేపథ్యం తప్ప.. ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేదు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బంపర్ మెజార్టీ సీట్లతో విజయం సాధించారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నుంచి తారిక్ రెహమాన్ ప్రభుత్వ బాధ్యతలు తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Meloni-Trump: ముందు మీ ప్రజాదరణ చూసుకోండి.. ట్రంప్‌పై మరోసారి మెలోని తీవ్ర ఆగ్రహం
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
-
Beetroot and Sugar Gum: బీట్రూట్ + చూయింగ్ గమ్.. బీపీకి కొత్త ఫార్ములా.?
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!