Ukraine Russia War: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య సమావేశం ముగిసింది. బెలారస్ వేదికగా సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. తక్షణమే కాల్పుల విరమణ చేయాలని, రష్యా సైన్యం తమ దేశం నుంచి వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అటు నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా కోరింది. ఈ డిమాండ్లకు ఇరుదేశాలు అంగీకరించకపోవడంతో చర్చలు విఫలంగా ముగిశాయి. ఒక్క తీర్మానం కూడా లేకుండా రెండు దేశాలు చర్చలను ముగించాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ రక్షణమంత్రి సహా ఆరుగురు ప్రతినిధులు హాజరు కాగా రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు.
మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్లోని మెజారిటీ దేశాల విమానాలు రష్యా గగనతలంపై ఎగరకుండా నిషేధం విధించారు. రష్యా నిషేధం విధించిన దేశాల్లో బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, అల్బేనియం, బెల్జియం, బల్గేరియా, హంగేరీ, డెన్మార్క్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ, కెనడా, లాథ్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, రొమేనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, క్రొయేషియా, స్వీడన్, ఎస్టోనియా తదితర దేశాలున్నాయి.
Also Read
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
కాగా అటు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి భేటీలో పాల్గొన్నారు. గత 24 గంటల్లో ప్రధాని మోదీ మూడో సమావేశం నిర్వహిస్తుండగా.. ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను కేంద్రం ఇప్పటికే తరలిస్తుండగా ఈ సమావేశంలో తరలింపును వేగవంతం చేయడంపై ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!