Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
- మేము చైనాకు బానిసలం కాదు..
- తైవాన్ ఒక స్వతంత్ర దేశం..
- ట్రంప్ ప్రకటనపై తైవాన్ అధ్యక్షుడు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taiwan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో తైవాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. చైనా చాలా కాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది. ‘‘వన్ చైనా’’ విధానంలో తైవాన్ కూడా భాగమే అని బీజింగ్ చెబుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక ప్రకటన చేశారు. ‘‘తైవాన్ బీజింగ్ ఆధీనంలో లేదు’’ అని అన్నారు. తైవాన్ స్వాతంత్య్రం అంటే తమ దేశం చైనాలో భాగం కాదని, దాని ఆధీనంలో లేమని స్పష్టం చేశారు. తైవాన్ భవిష్యత్తును వేరే దేశాలు కాకుండా, దాని ప్రజలే నిర్ణయిస్తారని లై చింగ్-టే చెప్పారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం అమెరికాపై ఆధారపడొద్దని ఆయన అన్నారు. ఇదే కాకుండా చైనా బలమైన మిలటరీ శక్తి అని, తైవాన్ను రక్షించడానికి అమెరికా చాలా దూరంలో ఉందని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకటనే తైవాన్ ఆగ్రహానికి కారణమైంది. చైనా వైఖరిని, ట్రంప్ వ్యాఖ్యల్ని తైవాన్ అధ్యక్షుడు తప్పుపట్టారు. తమ ప్రజలు స్వాతంత్య్రంలో రాజీ పడబోరని స్పష్టం చేశారు.
1949లో, చైనాలో అంతర్యుద్ధం జరిగింది. ఓడిపోయిన ప్రభుత్వం తైవాన్‌కు పారిపోయింది. దీని తరువాత, చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుండి, తైవాన్ తన భూభాగంలో భాగమని చైనా వాదిస్తూ వస్తోంది. చాలా సార్లు తైవాన్ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. తైవాన్ను బెదిరించే ప్రయత్నం చేసింది. పలుమార్లు అమెరికా తైవాన్ స్వతంత్రతకు మద్దతు తెలిపింది. అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలు తైవాన్ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!