తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
China-Taiwan Conflict: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి అయిన లై చింగ్-తే అధ్యక్షుడిగా విజయం సాధించడం డ్రాగన్ కంట్రీకి మింగుడుపడటం లేదు. లీ చింగ్-తే గెలిచినప్పటి నుంచి తైవాన్‌ని బెదిరించేందుకు చైనా ప్రకటనలు చేస్తోంది. చైనా హెచ్చరికలను ధిక్కరిస్తూ.. సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తీవ్రంగా శిక్షించబడుతుందని చైనా విదేశాంగ మంత్రి ఆదివారం హెచ్చరించారు.
Taiwan: ప్రపంచ వ్యాప్తంగా తైవాన్ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. చైనా, తైవాన్‌ని సొంతం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్న వేళ, చైనాకు ట్రబుల్ మేకర్‌గా పేరుపొందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) నేత లై చింగ్-తే విజయం సాధించారు. వరసగా మూడో సారి అక్కడి ప్రజలు ఈ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో చైనాకు గట్టి దెబ్బతాకినట్లు అయింది. ఎన్నికల సమయంలో లై చింగ్‌ని చైనా ప్రమాదకరమైన వేర్పాటువాదిగా నిందించింది.