Sweden: 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం ‘‘తక్కువ సమయమే’’ జరిగిందట.. స్వీడన్ కోర్టు తీర్పుపై ఆగ్రహం..
- యూరప్ దేశాలకు ఏమైంది..?
- 16 ఏళ్ల బాలికపై అత్యాచారం..
- ఆఫ్రికా శరణార్థి బహిష్కరణకు స్వీడన్ కోర్టు నిరాకరణ..
- తీర్పుపై సర్వత్రా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sweden: యూరప్ దేశాలకు ఏమైంది. సొంత దేశ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా కూడా, మానవ హక్కులు, శరణార్థి హక్కులు అంటూ వ్యవహరిస్తూ, నేరస్తుల్ని శిక్షించడం లేదు. శరణార్థులుగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల నుంచి యూరప్ దేశాలకు వచ్చిన వ్యక్తులు నేరాల్లో భాగస్వాములు అవుతున్నారు. బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఇలా పలు దేశాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, 16 ఏళ్ల అమ్మాయి అత్యాచార కేసులో స్వీడన్ కోర్టు ఇచ్చిన తీర్పును, ప్రపంచం తీవ్రంగా విమర్శిస్తోంది.
16 ఏళ్ల బాలికపై ఆఫ్రికా దేశమైన ఎరిత్రియాకు చెందిన శరణార్తి యాజిద్ మొహమ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించకూడదని స్వీడన్ కోర్టు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది..?’’ అని ప్రశ్నించారు.
Also Read
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- UK: లండన్‌లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
- US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్‌తో మళ్లీ టెన్షన్..
- Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
Read Also: Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..
రేప్ జరిగిన సమయం తక్కువ అని, యాజిద్ మొహమ్మద్ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, జైలు శిక్ష తర్వాత దేశం నుంచి బహిష్కరించబోమని అప్పర్ నార్త్ అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తన తీర్పులో.. అత్యాచారం ‘‘తగినంత తీవ్రమైనది కాదు’’ అని పేర్కొంది. అత్యాచార తీవ్రమైన నేరంగా పరిగణించబడేలా ఎక్కువ టైమ్ కొనసాగలేదు, కాబట్టి అతడిని దేశం నుంచి బహిష్కరించే అవసరం లేదు అని పేర్కొంది.
ఈ సంఘటన గత ఏడాది సెప్టెంబర్ 1న జరిగింది. 16 ఏళ్ల అమ్మాయి మేయా మెక్‌డొనాల్డ్స్ వద్ద పని ముగించుకుని సబ్-వే గుండా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో 18 ఏళ్ల యాజిద్ మొహమ్మద్ ఆమెను అత్యాచారం చేశాడు. స్వీడన్ కోర్టు తీర్పుపై ట్రంప్ జూనియర్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది?? చిన్న అత్యాచారమని, చెడ్డ వ్యక్తిని దేశం నుంచి పంపించమని యూరప్ అంటోంది. ప్రజలారా మేల్కొంది. మనం మంచివాళ్లమని చూపించుకునే ప్రయత్నంలో మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
What the hell is going on in this world? Europe is at “Well, it was only a short rape” so we won’t get rid of a total piece of shit in our country. WTF? Wake up people, we are virtue signaling ourselves into extinction! https://t.co/1nO6fwaHis
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) October 24, 2025
తాజావార్తలు
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
-
Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!