నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ రాక మరోసారి వాయిదా పడింది. స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో భూమ్మీదకు తిరిగి రావడం ఆలస్యం కాబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్‌లో నలుగురు వ్యోమగాముల సిబ్బంది ఉన్నారు.