అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి… వంద మందికి పైగా మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గత ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక జరిగిన అతిపెద్ద దాడి ఇదే. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి తమ పనే అని ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఉయ ఖోహ్రసన్ ప్రావిన్స్ – ISKP ప్రకటించింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, షియా సోదరుల భద్రతకు కట్టుబడి ఉన్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాయక… అక్కడ అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. గత ఆగస్టులో కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద అమెరికా దళాలు లక్ష్యంగా ISKP ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఇప్పుడు కుందుజ్‌లో మారణహోం సృష్టించింది. ఇదిలా ఉంటే… ఇటీవల కాబూల్‌లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!