Earthquake: బ్యాంకాక్, మయన్మార్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు
- బ్యాంకాక్, మయన్మార్‌లో భారీ భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు.. జనం పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం ఉదయం మయన్మార్‌లోని మధ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బ్యాంకాక్‌లో కూడా తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
Also Read
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
థాయిలాండ్‌లో భూప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇక పర్యాటన నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు, పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
Breaking: Video shows the moment a skyscraper under construction collapsed due to earthquake in Bangkok. pic.twitter.com/OIdxc4epKf
— PM Breaking News (@PMBreakingNews) March 28, 2025
Breaking: Video shows water falling from a rooftop pool after earthquake tremors hit Bangkok. pic.twitter.com/nzoKKo42fg
— PM Breaking News (@PMBreakingNews) March 28, 2025
https://twitter.com/niannelynn/status/1905507150300119055
Big earthquake in Bangkok. Whole building was shaking for 3 min or so pic.twitter.com/ztizXSoGl1
— On The Rug (@On_the_Rug) March 28, 2025
Whole Bangkok shook like Crazy! #Bangkok #earthquake pic.twitter.com/99v7ySZDGc
— Srushti Gopani (@DrSrushtiG) March 28, 2025
తాజావార్తలు
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!