Site icon NTV Telugu

Srilanka Economic Crisis: దేశంలో స్కూళ్లు బంద్.. కారణం ఇదే

Srilanka

Srilanka

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు.

ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ భోదన చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Read Also: BJP National Executive Meeting: విజ‌య‌వంతంగా బీజేపీ స‌భ‌.. బండి భుజం తట్టిన మోడీ

అప్పర్ మిడిల్ ఆదాయ దేశంగా ఉన్న శ్రీలంక స్వాతంత్య్రం పొందిన 1948 నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఏనాడు చూడలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అప్పులు వెరిసి శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీంతో ఈ పరిణామాలకు కారణం అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహిందా రాజపక్సేలే కారణం అని శ్రీలంక ప్రజలు వీరిద్దరు రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. కొత్తగా రణిల్ విక్రమసింఘే ప్రధాని పదవిని చేపట్టారు. మే నెలలో ఆహార ద్రవ్యోల్భనం 57.4 శాతంగా ఉంది. మార్చి 2022 నుంచి శ్రీలంక కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది.

 

Exit mobile version