NTV Telugu Site icon

Srilanka Crisis: రాజపక్స పారిపోయేందుకు భారత్ సహకారం.. స్పందించిన విదేశాంగ శాఖ

Gotabaya Rajapaksa

Gotabaya Rajapaksa

శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలపై భారత్ స్పందించింది. బుధవారం కొలంబోలోని భారత హైకమిషనర్ ‘ ఇవి నిరాధారమైన, ఊహాజనిత’ కథనాలుగా ఖండించింది. గొటబాయ పారిపోవడంతో మా పాత్ర ఏం లేదని హైకమిషన్ తోసిపుచ్చింది. శ్రీలంకకు భారత ప్రజల మద్దతు కొనసాగుతుందని.. ప్రజలు తమ ఆకాంక్షలను ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

Read Also: Hyderabad: హైదరాబాద్‌ను 3 ‘జిల్లాలు’ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ

బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శ్రీలంక వైమానిక దళానికి చెందిన ఆంటనోవ్-32 విమానంలో రాజపక్స భార్య మరో ఇద్దరు బాడీగార్డులతో కలిసి మాల్దీవులు రాజధాని మాలేకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ కూడా ధ్రువీకరించింది. మరోవైపు ఈ రోజు రాజీనామా చేస్తానని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన రిజైన్ లెటర్ రాలేదని..పార్లమెంట్ స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. అయితే ఒక రోజులో రాజీనామా లేఖ రావచ్చని అభిప్రాయపడింది. మరోవైపు అఖిల పక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు సజిత్ ప్రేమదాస లేక పోతే మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే అధ్యక్షుడు అయ్యే అవకాశం కనిపిస్తోంది.