దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడిపై ‘గుప్తా’ధిపత్యమే పతనానికి దారితీసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో అల్లర్లు తారాస్థాయికి చేరుకున్నాయి. అల్లరి మూకలు దుకాణాలను కొల్లగొడుతున్నారు. దక్షిణాఫ్రికా స్వాతంత్ర సమరయోధుడు నెల్సన్ మండేలా స్పూర్తితో అప్పట్లో దక్షిణాఫ్రికా స్వాతంత్రపోరాటంతో పాల్గొని తరువాత రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్షుడిగా ఎదిగిన జాకబ్ జుమా అవినీతి భాగోతాలు బయటపడటంతో పదవిని పోగొట్టుకొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జాకబ్ అవినీతి మరకలు, జైలు జీవితం వెనుక ఆ దేశంలో స్థిరపడిన ముగ్గురు గుప్తా బ్రదర్స్ ఉన్నారు.
Also Read
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
వీరి మూలాలు ఇండియాలోనే ఉండటం విశేషం. యూపీలోని సహరాన్‌పూర్ సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన గుప్తా బ్రదర్స్ అజయ్, అతుల్, రాజేష్‌లు మొదట ఢిల్లీలో కంప్యూటర్ విడిభాగాల వ్యాపారం చేశారు. ఇందులో అతుల్ దక్షిణాఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం ప్రారంభించారు. అదే సమయంలో మండేలా పార్టీ అయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌తో సంబంధాలు పెంచుకున్నారు. వ్యాపారం జోరుగా సాగింది. థాబో ఎంబెకి ఇండియా వచ్చిన సమయంలో ఆయన సహచరుడు ఎపోస్ పహాద్‌తో అతుల్‌కు పరిచయం ఏర్పడింది.
Read: అనుష్క సినిమా ఆగిపోయిందా ?
దీంతో గుప్తా కుటుంబం మొత్తం దక్షిణాఫ్రికా పయనం అయింది. అక్కడే చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టారు. పార్టీ బ్యూరోకాట్స్‌కు వాటాలు వెళ్లేవి. అలా మొదలైన వ్యాపారం యూరేనియం తవ్వకాల వరకు వెళ్లింది. అప్పట్లో అధ్యక్షుడి ఇంట్లో పార్టీలు అంటే గుప్తా బ్రదర్స్ కు పిలుపు ఉండాల్సిందే. ఇలా ఎంబెకీ పార్టీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటూనే, ప్రత్యర్థి నేత జుమాతో రహస్యంగా మంతనాలు సాగించేవారు. జుమా అధ్యక్షుడు అయ్యాక గుప్తా బ్రదర్స్ పెత్తనం మొదలైంది. గుప్తా బ్రదర్స్ ఎవరికి పదవి ఇవ్వాలి అంటే వారికి ఇవ్వాల్సిందే.
ఆ విధంగా పరిపాలనపై పట్టు పెంచుకున్నారు. అయితే, అనుభవం లేని వ్యక్తికి ఆర్ధిక శాఖను అప్పగించడంతో పతనం మొదలైంది. దక్షిణాఫ్రికా ఆర్ధికంగా కుప్పకూలిపోయింది. జుమా అవినీతి బయటపడతంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటు గుప్తా బ్రదర్స్‌కు కాంట్రాక్టులు ఆగిపోయాయి. స్టాక్ ఎక్సెంజి నుంచి గుప్తా బ్రదర్స్ కంపెనీలు డీలిస్ట్ కావడంతో షేర్లు పడిపోయాయి. వ్యాపారం దెబ్బతినడంతో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో గుప్తాబ్రదర్స్ పెట్టేబేడా సర్దుకొని దుబాయ్ వెళ్లిపోయారు. జుమా జైల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!