South Africa: దక్షిణాఫ్రికాలో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు. ఆదివారం, జోహెన్నెస్‌బర్గ్ నగరం వెలుపల ఉన్న ఒక టౌన్షిప్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు, మరో 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాలో నెల రోజుల కాలంలో జరిగిన రెండో సామూహిక కాల్పుల ఘటన ఇది. నగరానికి నైరుతి దిశలో 25 మైళ్ల దూరంలో ఉన్న బెకర్స్‌డాల్‌లో ఈ ఘటన జరగింది. అయితే, కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశ్యం స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Read Also: Hyderabad: ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల.. కట్‌చేస్తే
ఈ ఘటన అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక అనధికార బార్ సమీపంలో చోటు చేసుకుంది. దాడికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. గుర్తుతెలియని దుండగులు కొంత మందిని యాదృచ్ఛికంగా కాల్చినట్లు పోలీసులు తెలిపారు. గౌటెంగ్ ప్రావిన్స్ పోలీస్ ప్రతినిధి బ్రిగేడియర్ బ్రెండా మురిడిలి మాట్లాడుతూ.. మరణించిన వారి వివరాలు ఇంకా పూర్తిగా అందలేదు, మొత్తం 10 మంది మృతి చెందారు అని చెప్పారు. కాల్పులు జరిగిన బెక్కర్స్డాల్ ప్రాంతం దక్షిణాఫ్రికాలో ప్రధాన బంగారు గనులకు సమీపంలో ఉన్న ఒక పేద ప్రాంతంగా గుర్తింపు పొందింది. డిసెంబర్ 06న ప్రిటోరియా సమీపంలోని ఓ హాస్టల్లో జరిగిన కాల్పుల్లో మూడేళ్ల చిన్నారితో సహా 12 మంది మరణించారు. ఆదివారం జరిగింది ఈ నెలలో రెండో ఘటన.