NTV Telugu Site icon

Pakistan: సిక్కు మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. 9 నెలల తర్వాత రక్షించిన పోలీసులు..

Sikh Woman

Sikh Woman

Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్‌లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. అయితే, ఆ దేశంలో మాత్రం హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ మైనారిటీపై దాడులు, మైనారిటీ మహిళలు, బాలికల కిడ్నాప్‌లు, అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందూ బాలికలు, యువతను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుకి చెందిన సిక్కు మహిళను తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేశారు. 40 ఏళ్ల మహిళతో పాటు ఆమె మైనర్ కుమారుడిని ఇద్దరు నిందితులు అపహరించారు. తాజాగా ఆమెను, కుమారుడిని రక్షించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. లాహోర్‌కి 130 కి.మీ దూరంలోని పంజాబ్‌లోని ఫైపలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Bengal Governor: “నిందితుడిని ఉరితీసి, తర్వాత విచారించాలా.?” మమతా బెనర్జీపై గవర్నర్ ఫైర్..

బెండర్-బేస్డ్ వయొలెన్స్ యూనిట్ హెడ్(ఫైసలాబాద్) ఏఎస్పీ జైనాబ్ ఖలీద్ ప్రకారం.. నన్కానా సాహిబ్‌లో నివసిస్తున్న సిక్కు మహిళను ఫైసలాబాద్‌కి చెందిన ఖుర్రం షాజాద్, కిజార్ షాజాద్ అనే ఇద్దరు సోదరులు కిడ్నాప్ చేశారు. 9 నెలలుగా ఆమెపై పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడాకులు తీసుకున్న మహిళని నన్కానా సాహిబ్‌కి చెందిన సైమా అనే స్నేహితురాలు నిందితుడు ఖుర్రంకి పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

గతేడాది డిసెంబర్‌లో ఆమె తన మైనర్ కుమారుడిని ఫైసలాబాద్ నుంచి నాన్కానా సాహిబ్‌లోని తన సోదరి ఇంట్లో దిపాలని నిందితుడు ఖుర్రంని కోరింది. అయితే, బాలుడిని బందీగా పట్టుకుని అతను సోహైలాబాద్‌లోని తన ఇంటికి రావాలని మహిళని బలవంతం చేశాడు. అక్కడ నిందితులిద్దరూ మహిళను బంధించి అత్యాచారం చేశారు. తొమ్మిది నెలల నుంచి ఇద్దరు ఆమెపై పదే పదే అత్యాచారాని ఒడిగట్టినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఆమె బంధువు ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 14న ఖుర్రం ఇంటిపై దాడి చేసి ఆమెను, ఆమె కొడుకుని రక్షించారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారాన్ని ప్రతిఘటించిన సమయంలో తనపై దాడి చేసినట్లు సిక్కు మహిళ చెప్పింది.

Show comments