Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను విడిచి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై ఆమె విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడిగా పేర్కొన్నారు. ఆయన పాలనలో అక్రమ, హింసాత్మక పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఫారిన్ కారస్పాండెంట్స్ క్లబ్లో జరిగిన ‘సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్’ కార్యక్రమంలో హసీనా వీడియో సందేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అవామీలీగ్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, బంగ్లాదేశ్క వలసదారులు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాలపై హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jammu kashmir: పాక్ ఉగ్రవాది ఖతం.. భద్రతా బలగాలకు కీలక విజయం..
ఈ రోజు బంగ్లాదేశ్ అగాధం అంచున ఉందని, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. దేశం పెద్ద జైలు, ఉరిశిక్షలకు స్థలంగా, మరణ లోయగా మారిందని ఆమె ఆరోపించారు. ఆగస్టు 5, 2024న తనను అధికారంలో నుంచి తొలగించడాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ భయంకరమైన యుగంలోకి ప్రవేశించిందని, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రవాసజీవితం గుడుపుతోందని ఆమె అన్నారు. యూనస్ హత్యకాండ ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారీ, డబ్బు అక్రమ రవాణాదారు, అధికార దాహంతో దేశద్రోహం చేసిన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
యూనస్ పాలనలో మానవహక్కలు కారరాయబడ్డాయని, మీడియా స్వేచ్ఛను అణిచవేశారని, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని హసీనా అన్నారు. దేశవ్యాప్తంగా మూకదాడులు, దోపిడీలు, బెదిరింపులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు శాంతిగా ఉన్న దేశాన్ని ఇప్పుడు రక్తంతో తడిచిన నేలగా మారిందని ఆమె అన్నారు. తీవ్రవాద, మతతత్వ శక్తులు, విదేశాలు దేశాన్ని నాశనం చేశాయని ఆమె ఆరోపించారు.
