Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ..
- వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ..
- ప్రధాని వెంట వెళ్లనున్న ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ లో తీవ్రమైన వరదలు, ఖతార్ పై ఇజ్రాయిల్ దాడి మొదలైన అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తతు కూడా ఈ సమావేశంలో పరిష్కరించబడుతాయని నివేదిక తెలిపింది.
అయితే, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐసీసీ), వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయానికి దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే ఆసిమ్ మునీర్ రెండు సార్లు అమెరికాలో పర్యటించారు. దీని తర్వాత, పాక్ ప్రధాని భేటీపై వార్తలు వచ్చాయి.
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
Read Also: Pakistan: జై షాకు భయపడ్డ పాకిస్తాన్.. ఐసీసీ ఆంక్షలు విధిస్తుందని పీసీబీ యూ-టర్న్.!
పెరుగుతున్న యూఎస్-పాక్ సంబంధాలు:
అమెరికాకు ప్రత్యర్థిగా పరిగణిస్తున్న చైనాతో ఇన్నాళ్లు అంటకాగిన పాకిస్తాన్, ఇప్పుడు అమెరికాతో సంబంధాల కోసం చూస్తోంది. ఏళ్ల తరబడి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జూన్ నెలలో ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో వైట్హౌజ్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ గురించి చర్చించడంతో పాక్-అమెరికా సంబంధాలు మళ్లీ బలపతున్నాయి. దీని తర్వాత, జూలైలో పాకిస్తాన్లో భారీగా ‘‘చమురు నిల్వలు’’ ఉన్నాయని, వాటిని డెవలప్ చేయడానికి సహకరిస్తామని అమెరికా చెప్పింది. ఇటీవల, ఖనిజ రంగంలో పాకిస్తాన్ అమెరికా నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందగలిగింది.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!