హిజాబ్ వ్యతిరేకంగా ఒక విద్యార్థిని నిరసన వ్యక్తం చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో అర్ధనగ్నం తిరుగుతూ హల్‌చల్ చేసింది. చుట్టూ విద్యార్థిని, విద్యార్థులు తిరుగుతున్నా.. ఏ మాత్రం జడియకుండా క్యాంపస్ ఆవరణలో తిరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Unified Lending Interface: ఇప్పుడు సిబిల్‌తో సంబంధం లేకుండా.. క్షణాల్లో లోన్!
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమీర్-కబీర్ విశ్వవిద్యాలయంలో ఒక మహిళా విద్యార్థినిని హిజాబ్ ధరించమని బలవంతం చేశారు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై ఇరాన్‌లోని ఇస్లామిక పాలన పోలీసులు, యూనివర్సిటీ భద్రతా సిబ్బంది దాడికి తెగబడ్డారు. ఆమె బట్టలు చించేశారు. దీంతో ఆమె విసుగెత్తిపోయి.. మొత్తం దుస్తులన్నీ తొలగించి నిరసన తెలిపింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. చుట్టూ మగ విద్యార్థులు ఉన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా తిరుగుతూనే ఉంది. అక్కడే ఉన్న విద్యార్థులు మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక కొద్దిసేపటికి ఇంటెలిజెన్స్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది ఆమెను తీవ్రంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం గుర్తుతెలియని వాహనంలో తీసుకెళ్లిపోయారు.
A student at Iran’s University of Science and Research, after being harassed and confronted by security officers over her hijab, during which her clothes were torn, removed her clothing in protest and sat down in the middle of the campus.
یک دانشجوی دانشگاه علوم و تحقیقات ایران… pic.twitter.com/p5OqITfopE
— Saman Rasoulpour (@SamRasoulpour) November 2, 2024