Security Guard Talking With Ghost Patient In Hospital: దెయ్యాలు నిజంగానే ఉన్నాయా? లేవా? చాలామంది దెయ్యాలున్నాయని నమ్ముతారు. అవి మనతో పాటే జీవనం కొనసాగిస్తున్నాయని విశ్వసిస్తారు. కొందరు మాత్రం దెయ్యాలనేవి ఉండవని, అది మన భ్రమ మాత్రమేనని చెప్తుంటారు. ఈ డిబేట్ సంగతి పక్కనపెడితే.. మన ప్రపంచంలో కొన్ని విచిత్రమైన సంఘటనలైతే చోటు చేసుకున్నాయి. ఎన్నో అంతుచిక్కని మిస్టరీలూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ఘటన సైతం.. అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది. ఒక ఘోష్ట్ పేషెంట్‌తో సెక్యూరిటీ గార్డ్ మాట్లాడటం, దాని డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడం.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అర్జెంటీనాలోని ఫినోచిట్టో శానిటోరియం, బ్యూనస్ ఎయిర్స్‌లో ఉన్న ఒక ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా, ఇది మాత్రం నిజంగా జరిగింది.
ఆ వీడియోలో ఏముందంటే.. తొలుత ఆసుపత్రి డోర్లు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. చూడ్డానికి అక్కడ ఎవరూ లేరు కానీ, ఎవరో ఎంట్రీ అవుతున్నట్టు కనిపిస్తోంది. అది గమనించిన సెక్యూరిటీ గార్డు.. వెంటనే తన సీటులోంచి లేచి, నో ఎంట్రీ రోప్ తీసి, రిజిష్టర్‌లో ఎవరో పేషెంట్ వచ్చినట్లు వివరాల్ని నమోదు చేసుకున్నాడు. కాసేపు ఆ దెయ్యంతో ముచ్చటించాడు కూడా! అనంతరం.. లోపలికి ఎలా వెళ్లాలో వివరించాడు. ఆ తర్వాత.. ఒక వీల్ ఛైర్ ఇచ్చి, తిరిగి తన స్థానంలో వెళ్లి కూర్చున్నాడు. ఈ ఘటన రాత్రి 3 గంటల సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఆ మొత్తం తతంగం చూసి, ఆసుపత్రి వర్గాలు షాక్ అయ్యారు. ఒకవేళ ఆ సెక్యూరిటీ గార్డు ఏమైనా కావాలనే అలా ప్రవర్తించాడా? అంటే, మరి ఆ డోర్లు ఎలా ఓపెన్ అయ్యాయి? అనేది అంతుచిక్కని ప్రశ్న. దీంతో.. ఆ ఆసుపత్రిలోకి ఘోస్ట్ పేషెంట్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ప్రతి గంటకోసారి ఆ ఆసుపత్రి తలుపులు తెరుచుకుంటాయని ఆసుపత్రి యాజమాన్యం చెప్తోంది. అంతేకాదు.. ఏ పేషెంట్ వివరాలు కూడా ఆ సమయంలో రికార్డ్ చేయలేదని అంటున్నారు. తలుపులు సరే, ఆ సెక్యూరిటీ గార్డు ఎందుకలా నిజంగానే పేషెంట్ వచ్చినట్లు ప్రవర్తించాడు? కావాలనే అలా చేశాడా? నెటిజన్లు కూడా అదే ప్రశ్న లేవనెత్తుతున్నారు. బహుశా సెక్యూరిటీ గార్డు ఫేమస్ అవ్వడం కోసం కావాలని అలా చేసి ఉండొచ్చని, సీసీఫుటేజ్‌లో రికార్డు అవుతుందనే తెలిసే ఇలా చేసి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ హంగామా సృష్టిస్తోంది.
Watch the shocking moment hospital security attends to 'ghost patient' after dying the day before pic.twitter.com/cWyPtCYzjk
— Newspremises (@News_premises) November 21, 2022