Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు, శ్రీలంక హిందువుకు ఊరట..
- మరణశిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: దైవదూషణ ఆరోపణలో సౌదీ అరేబియాలో మరణశిక్షకు గురైన శ్రీలంకకు చెందిన హిందూ వ్యక్తి అనోజన్ శివరసకు ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అతడికి సౌదీ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ శిక్షను సౌదీ సుప్రీంకోర్టు నిలిపేసింది. శివరస మరణశిక్షను సౌదీ అత్యున్నత కోర్టు అక్టోబర్ 13న రద్దు చేసినట్లు శ్రీలంక విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉపాధి మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 14న ఒక ప్రకటనలో వెల్లడించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
హిందూ యాత్రతో వివాదం మొదలు..
జూన్ చివరిలో శ్రీలంకలో జరిగిన ఒక హిందూ యాత్రలో యాత్రికులను అనుసరిస్తున్న ఒక కుక్కను ఒక ముస్లిం వ్యక్తి తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఒక యూజర్ హిందూ దేవీదేవతలపై అవమానకరమైన పోస్టింగ్ చేశాడు. దానికి ప్రతిస్పందనగా శివరస తమిళంలో ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత దీనిని తొలగించి, క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు అప్పటికే వైరల్ అయ్యాయి. శ్రీలంకకు చెందిన కొందరు సౌదీలోని శివరస యజమానికి వీటిని పంపడంతో కేసు నమోదైంది.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
మరణ శిక్ష, శ్రీలంక ప్రయత్నాలతో రద్దు..
జూలై 5న అల్-అహ్సా క్రిమినల్ కోర్టు అనోజన్కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాళ్ల జరిమానా విధించింది. ఆ తర్వాత సౌదీ అరేబియా అప్పీల్ కోర్టు శివరస ‘‘దైవదూషణ’’కు పాల్పడ్డాడని మరణశిక్ష విధించింది. తాజాగా అక్టోబర్ 13న మరణశిక్షను రద్దు చేసింది.
శివరసను మరణశిక్ష నుంచి తప్పించేందుకు శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసింది. శ్రీలంక తమిళ, ముస్లిం ఎంపీలు సెప్టెంబర్ 24న సౌదీ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. శ్రీలంకలోని బౌద్ధ, హిందూ మత పెద్దలు కూడా ఈ కేసులో జోక్యం చేసుకోవాలని శ్రీలంక అధ్యక్షుడిని కోరారు. సౌదీ అరేబియాలోని శ్రీలంక రాయబారి ఒమర్ లెబ్బే అమీర్ అజ్వాద్ అక్టోబర్ 8న దమ్మామ్ సెంట్రల్ జైలులో అనోజన్ను కలిశారు. శ్రీలంక ప్రభుత్వం ఒక న్యాయ బృందాన్ని శివరస కోసం సౌదీకి పంపింది. అయితే, మరణశిక్ష రద్దు అయినా ఆయన పూర్తిగా విడుదల అవుతారా? లేదా.? అనే దానిపై స్పష్టత లేదు.
తాజావార్తలు
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..