Saudi Houthi deal: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో సౌదీ అరేబియా సతమతం అవుతోంది. హౌతీలు సౌదీ ఆయిల్, సైనిక మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడుతున్నారు. హౌతీలను అడ్డుకోవడం సౌదీకి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హౌతీలతో ఒప్పందం కుదుర్చుకుని చమురు ఎగుమతుల్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా కీలక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హౌతీలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ‘‘ 1 బిలియన్ డాలర్ల’’ను సౌదీ ఆఫర్ చేస్తోంది. భారత కరెన్సీలో సుమారుగా రూ. 9500 కోట్లు.
సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ ఆకస్మికంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ వెళ్లారు. ఈ సమయంలోనే హౌతీలతో డీల్‌కు ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ చర్చల్లో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సౌదీ మంత్రి ప్రయాణించిన హెర్క్యూలస్ సైనిక రవాణా విమానంలోనే ఒక బిలియన్ డాలర్ల నగదు తీసుకెళ్లినట్లు ఇజ్రాయిల్ హయోమ్ నివేదించింది. ఈ విషయాన్ని సౌదీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇబ్రహీం కలిన్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. ఇరాన్ తరఫున అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెందిన మొహ్సెన్ రెజాయీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నట్లు నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియాతో పాటు పాకిస్తాన్, టర్కీ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ మూడు దేశాలు ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

