Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: కఠినమైన ఇస్లామిక్ నిబంధనలు ఉండే సౌదీ అరేబియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశంలో ఉన్న ఏకైక అధికారిక మద్యం దుకాణంలో స్టాక్ నిండుకోవడంతో విదేశీయులు, దౌత్యవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీర్, వైన్, టకీలా వంటి ఉత్పత్తులు దాదాపుగా అయిపోయాయని సమాచారం. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సరఫరాపై యుద్ధం ప్రభావం
బహ్రెయిన్, యూఏఈ మీదుగా సౌదీకి అందాల్సిన మద్యం సరఫరాలు నిలిచిపోయాయి. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో కొత్త సరుకులు సకాలంలో రాకపోవడంతో దుకాణంలోని అరలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం చాలా తక్కువ పరిమాణంలో, అది కూడా అంతగా ప్రాచుర్యం లేని ఖరీదైన బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని దౌత్యవేత్తలు చెబుతున్నారు. స్టాక్ తక్కువగా ఉండటంతో మద్యం కోసం విదేశీయులు గంటల తరబడి క్యూ కడుతున్నారు. పగటిపూట తమ పనులను సైతం వదిలి వచ్చి లైన్లలో నిలబడుతున్నారు. ఈ క్రమంలో తోపులాటలు, వాగ్వాదాలు జరిగి గొడవలకు దారితీస్తోందని టాక్. వైట్ వైన్ వంటివి అసలు దొరకడం లేదని, ఇటీవల వచ్చిన బీర్ స్టాక్ కూడా గంటల్లోనే అయిపోయిందని సమాచారం.
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
సౌదీ అరేబియాలో 1952 నుంచి మద్యంపై పూర్తి నిషేధం ఉంది. అయితే యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తన ‘విజన్ 2030’లో భాగంగా దేశాన్ని పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు క్రమంగా నిబంధనలను సడలిస్తున్నారు. ముస్లిమేతర దౌత్యవేత్తలు, సంపన్న విదేశీయులను ఆకర్షించేందుకు 2024లో రియాద్‌లోని దౌత్య ప్రాంతంలో ఈ రహస్య దుకాణాన్ని ప్రారంభించారు. దీనికి ఎటువంటి పేరు గానీ, సైన్ బోర్డు గానీ ఉండదు. ప్రస్తుతం జెడ్డా, అరామ్కో ప్రాంతాల్లో మరిన్ని మద్యం దుకాణాలను తెరవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత సరఫరా సమస్యల నేపథ్యంలో అవి ఎప్పుడు ప్రారంభమవుతాయనేది స్పష్టత లేదు. ఈ మద్యం కొరత, సరఫరా అంతరాయాలపై సౌదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?