Russia-Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఉక్రెయన్-రష్యా యుద్ధంలో అమెరికా లబ్ధి పొందేందుకు చూస్తోందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక, సైనిక-వ్యూహాత్మక పరంగా దీన్ని నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తోంది తెలిపారు. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని నియంత్రిస్తుందన్నారు. రష్యా యుద్ధభూమిలో ఉందని.. విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Lionel Messi: ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక
అమెరికా జియో పొలిటికల్ గా తన ప్రయోజనాలు పొందాలని చూస్తోందని.. రష్యా, యూరప్ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు చూస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ దళాల అవసరాల కోసం భారీగా ఆయుధాలను ఎగుమతి చేయడం ద్వారా లబ్ధిపొందాలని అమెరికా యోచిస్తోందని.. ఉక్రెయిన్ సైనిక అవసరాలను పెంచేలా అమెరికా చేస్తోందని లావ్రోవ్ అన్నారు. ఉక్రెయిన్ ఇప్పటి వరకు అమెరికా నుంచి 40 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని పొందిందని.. ఇది అనేక యూరప్ దేశాల సైనిక బడ్జెట్ తో సమానం అని తెలిపారు.
గతంలో పోలాండ్ లో క్షిపణి పడినప్పుడు ఇది రష్యా క్షిపణి అని జెలన్స్కీ అబద్దాలు చెప్పారని అన్నారు. ఉక్రెయిన్ పై అణ్వాయుధ దాడిపై.. రష్యా అలాంటి పని చేయదని ఆయన స్పష్టంగా చేశారు. రష్యాను పూర్తిగా నిలువరించే పాశ్చాత్య విధానం ప్రమాదకరమని అన్నారు. అణు యుద్ధంలో ఎవరూ గెలవలేరని.. ఎప్పటికీ పోరాడకూడదని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ తో రష్యా సంబంధాలు క్షీణించడానికి అమెరికానే కారణం అని తెలిపారు.