Russia on Pelosi Taiwan Visit: అమెరికా ప్రతినిధుల సభ(సెనేట్) స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తారని వార్తలు వివాదానికి దారితీశాయి. ఇప్పటికే తైవాన్‌లో అడుగుపెడితే ఊరుకోమని చైనా అమెరికాను పదేపదే హెచ్చరిస్తోంది.గతవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధినేత జీ జిన్‌పింగ్ ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా తైవాన్ విషయంలో నిప్పుతో ఆడుకోవద్దని బైడెన్‌ను జిన్‌పింగ్ హెచ్చరించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించింది. ఇదిలా ఉండగా అమెరికా తీరును రష్యా కూడా తప్పుపట్టింది. చైనాకు వంత పాడుతూ రష్యా కూడా అమెరికాను హెచ్చరించింది.
అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ను సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని రష్యా అమెరికాను హెచ్చరించింది. అయితే పెలోసి ఇంకా ద్వీపాన్ని సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. ఆమె అక్కడికి చేరుకుంటారా లేదా అనేది తాము ఇప్పుడే చెప్పలేమని.. అయితే ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్య అని మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులతో అన్నారు. నాన్సీ పెలోసి తైవాన్‌ని సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. తైవాన్ తమదేనని పదేపదే హెచ్చరించినా అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. యూఎస్ పెలోసి తైవాన్ పర్యటన ఖరారు చేయడం అంటే బీజింగ్‌కి విరుద్ధంగా వ్యవహరించడమేని నొక్కి చెప్పారు. మరోవైపు ఈ పెలోసీ పర్యటనను సీరియస్‌గా తీసుకున్న చైనా ఇప్పటికే తైవాన్‌కి సంబంధించిన సుమారు 35 ఆహర ఎగుమతులను నిషేధించింది. తమది అని చెప్పుకుంటున్న తైవాన్‌కు వెళ్లకుండా పెలోసీని చైనా పదే పదే హెచ్చరించింది. కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసిన ఒక-చైనా సూత్రానికి పెలోసి పర్యటన విరుద్ధంగా ఉంటుందని బీజింగ్ పేర్కొంది.
Anand Mahindra: ఆశీర్వాదం అడిగిన వినియోగదారుడికి ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై
తైవాన్‌లో యూఎస్ అధికారుల సందర్శనలు ద్వీపంలోని స్వాతంత్య్ర అనుకూల శిబిరానికి ప్రోత్సాహకరమైన సంకేతాన్ని పంపుతున్నట్లు చైనా అభిప్రాయపడింది. వాషింగ్టన్కు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు కానీ ద్వీపాన్ని రక్షించుకోవడానికి అవసరమైన మార్గాలను అందించడానికి యూఎస్ చట్టం కట్టుబడి ఉంది.
మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు: చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ఆమె తైవాన్ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని తెలిపింది. అయితే పెలోసీ మాత్రం తైవాన్‌కు వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె మలేసియాలో ఉన్నారు. ఈ రాత్రికి ఆమె తైపే నగరానికి చేరుకునే అవకాశాలున్నాయని పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో అమెరికా అప్రమత్తమైంది. తైవాన్ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించినట్లు రాయిటర్స్ వార్తాకథనం వెల్లడించింది. అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ క్యారియర్ దక్షిణ చైనా సముద్రాన్ని దాటుకుని ఫిలిప్పీన్స్ సముద్రంలోకి చేరుకుందని సదరు కథనం పేర్కొంది. తైవాన్‌కు తూర్పువైపున ఈ యుద్ధ నౌకలు మోహరించినట్లు తెలుస్తోంది.