Russia-Ukraine War: విరుచుకుపడుతున్న మాస్కో సేనలు.. లక్ష్యమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్‌స్క్ గవర్నర్ సెర్నీ హైదాయ్ గురువారం ప్రకటించారు.
గనులు, పరిశ్రమలు, సముద్రతీరంతో సుసంపన్నమైన డాన్‌బాస్‌ను హస్తగతం చేసుకునేందుకు తహతహలాడుతున్న రష్యా… ఆ ప్రాంతంలోని పలు నగరాల్లో దాడుల తీవ్రతను పెంచింది. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో పలు పట్టణాలపై పట్టు చేజార్చుకున్న పుతిన్ సేనలు… డాన్‌బాస్ విషయంలో మాత్రం పట్టుదలతో చొచ్చుకు వెళ్తున్నాయి. లుహాన్స్క్ వీధుల్లో ఉక్రెయిన్ సైనికులు భీకరంగా పోరాడుతున్నారని స్థానిక గవర్నర్ సెర్నీ హైదాయ్ తెలిపారు. ప్రతి వీధిని, ప్రతి ఇంటిని లక్ష్యంగా చేసుకుని సివిరోడోనెట్స్క్‌లో రాకెట్లు, ఫిరంగులు, మోర్టార్లతో మాస్కో సేనలు విరుచుకుపడుతున్నట్టు వెల్లడించారు.
Also Read
- Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
- Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
డాన్‌బాస్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులు చాలాకాలంగా ఉక్రెయిన్ దళాలపై పోరాడుతున్నారు. సీవిరోడోంటెస్క్ కోసం రష్యా సైన్యం–ఉక్రెయిన్ సైన్యం వీధి పోరాటాలకు దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో ఇలాంటి పరిణామం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు పశ్చిమ ఉక్రెయిన్‌లో జైటోమైర్‌లోని సైనిక శిక్షణ కేంద్రంపై క్షిపణి దాడులు నిర్వహించామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ సైనికులతో కలిసి కొందరు విదేశీయులు, వాలంటీర్లు తుపాకులు చేతపట్టి యుద్ధరంగంలోకి దిగారు. రష్యా వీరిని కిరాయి హంతకులుగా పేర్కొంటోంది. రాజధాని కీవ్‌కు 125 కిలోమీటర్ల దూరంలోని జైటోమిర్‌లో ఉన్న సైనిక, శిక్షణ స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. క్షిపణి విధ్వంసక వ్యవస్థతో పాటు రెండు ఆయుధాగారాలను కూడా ధ్వంసం చేసినట్టు తెలిపింది. అయితే, ఈ విషయమై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. లైసిచాన్స్క్, బఖ్‌ముట్ తదితర ప్రాంతాల్లోనూ రేయింబవళ్లు దాడులు కొనసాగుతున్నాయి. రోజూ కనీసం వంద మంది సైనికులు చనిపోతున్నారని, పరిస్థితి కష్టంగా ఉందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి రెజ్నికోవ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాను బలహీనం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.
రష్యా నెలల తరబడి మేరియుపొల్‌పై సాగించిన దాడులకు మొత్తం ఎంతమంది మరణించారన్నది లెక్క తేలడం లేదు. భవన సెల్లార్ల నుంచి వందలాది మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ఒక్కో భవనంలో 50-100 మృతదేహాలు కనిపిస్తున్నాయి. మేరియుపొల్‌లో కనీసం 21 వేల మంది పౌరులు మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు.
యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పోరాడినందుకు గాను ఇద్దరు బ్రిటిష్ పౌరులు, ఒక మొరాకో పౌరుడికి రష్యా అనుకూల వేర్పాటువాదులు మరణశిక్ష ఖరారు చేశారు. ఉక్రెయిన్‌లో తమ చేతికి చిక్కిన ఈ ముగ్గురిపై కిరాయి సైనిక కార్యకలాపాలు, ఉగ్రవాదం అనే అభియోగాలు మోపారు. తూర్పు ఉక్రెయిన్‌లో ‘డోంటెస్క్ పీపుల్స్ రిపబ్లిక్’ పేరిట తామే సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశంలోని కోర్టు ద్వారా విచారణ జరిపారు. నేరం రుజువైందని పేర్కొంటూ ముగ్గురికి గురువారం మరణ శిక్ష విధించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!