Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Captain Miller: ధనుష్ సినిమాలో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?
మెడకు చుట్టూ తాళ్లను కట్టి చిత్ర హింసలకు గురిచేసి.. కాళ్లు విరగొట్టి అత్యంత దారుణంగా ఉక్రెయిన్ ప్రజలు, సైనికులను హత్య చేశారు. ఉక్రెయిన్ రష్యా సాగించిన దారుణకాండను వెలుగులోకి తెచ్చింది. సామూహికంగా వీరందర్ని ఖననం చేసిన చోటును గుర్తించింది ఉక్రెయిన్. శుక్రవారం 400కు పైగా మృతదేహాలను ఇజియమ్ లో కనుక్కున్నారు. వారిలో కొందరి మెడలకు తాళ్లు కట్టి.. కాళ్లు విరగొట్టి దారుణంగా హింసించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలన్ స్కీ అన్నారు. వందలాది మృతదేహాల్లో వారి చేతులను వెనక్కి కట్టి, మరికొందరికి ఉరితాడు బిగించి ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఇది రష్యా యుద్ధనేరాలకు రుజువని జెలన్ స్కీ అన్నారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇజియమ్ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఉంటాయనే అనుమానంతో మెటల్ డిటెక్టర్ తో ఉక్రెయిన్ అధికారులు స్కాన్ చేస్తున్నారు. వందలాది సైనికులు, పిల్లలు, ప్రజలు చిత్రహింసలకు గురయ్యారని.. కాల్చివేయడం, ఫిరంగి గుళ్లతో చంపబడ్డారని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇజియమ్ ఘటన బుచా విషాదం కన్నా చాలా పెద్దదని ఉక్రెయిన్ చెబుతోంది. రష్యాను మరింత ధీటుగా ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వాల్సింది జెలన్ స్కీ పాశ్చాత్య దేశాలను కోరారు.