రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్‌కు మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టగా, ఉక్రెయిన్‌లో రెబల్స్ తిరుగుబాటు దారులు దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. ఉక్రెయిన్ అనుకూల వాదులు ముందుగా దాడులకు దిగుతున్నారని, రెబల్స్ పేర్కొంటున్నారు. అయితే, ఉక్రెయిన్ వ్యతిరేకులే దాడులకు దిగుతున్నట్టు చెబుతున్నారు. దాడులకు దిగబోమని రష్యా చెబుతున్నది. కానీ, ఈ మాటలను నమ్మే స్థితిలో ప్రపంచదేశాలు లేవని, ఏ క్షణంలో అయినా రష్యా ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఉంటుందని అమెరికా వాదిస్తున్నది. అటు నాటో దళాలు సైతం రష్యాకు వార్నింగ్ ఇస్తున్నాయి.
Read: EV Car: ప్రపంచంలో టాప్ ఎలక్ట్రిక్ కారు ఇదే…
ఒకవేళ రష్యా దాడులకు దిగితే కఠినమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నది. జర్మనీ ఛాన్స్లర్ ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రష్యా పూర్తిస్థాయిలో యుద్ధ విన్యాసాలు చేస్తుండటంతో బోర్డర్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఒకవేళ యుద్ధం సంభవిస్తే తాము డైరెక్ట్‌గా రష్యాతో యుద్దం చేయబోమని, ఉక్రెయిన్ ప్రజలకు సహకరిస్తామని అమెరికా చెబుతున్నది. తాము చర్చలకు సిద్దమేనంటున్న రష్యా దౌత్యపరమైన దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తు వస్తుండటంతో ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.