Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం
- తాలిబాన్‌తో సంబంధాలు బలపర్చుకుంటున్న రష్యా
- ఉక్రెయిన్ యుద్ధంలో తాలిబన్ పాల్గొంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. తాలిబాన్ ప్రభుత్వం కోసం రష్యా అధికారికంగా గుర్తింపు ఇచ్చిన తర్వాత.. మాస్కో ఈ గ్రూప్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. రష్యా తాలిబాన్‌తో సైనిక ఒప్పందం కుదరడం అసాధ్యమైన విషయం అన్నట్టుగా భావించేవారు. గతంలో రష్యా తాలిబాన్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించేది. కానీ ఇప్పుడు రష్యా.. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఈ తాజా సైనిక ఒప్పందం రెండు దేశాల మధ్య విస్తరించే సంబంధాలను మరో దశకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.
సైనిక ఒప్పందం ఏమిటి?
ప్రస్తుతం ఒప్పందం వివరాలు అధికారికంగా వెల్లడించబడలేదు. కానీ ఇది మాస్కో-కాబుల్ మధ్య సంబంధాలను లోతుగా పెంచే ప్రయత్నంగా పరిగణించవచ్చు. ఈ ఒప్పందం ఆఫ్గాన్ డిఫెన్స్ మినిస్టర్ మోహమద్ యాకూబ్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గే షోయ్గు మధ్య మాస్కోలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది.
Also Read
- Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
యాకూబ్ మాట్లాడుతూ.. ‘‘రష్యాతో పరస్పర చర్యలు మనకు ముఖ్యం. ఆఫ్గాన్-రష్యా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మేము ఈ దిశలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.’’ అని తెలిపారు. ఈ ఒప్పందం తాలిబాన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి రష్యా తొలగించిన ఏడాది తర్వాత కుదిరింది. తద్వారా రాజకీయ, డిప్లమాటిక్, సెక్యూరిటీ సహకారం పెరగడానికి దారి తీసింది.
రష్యా.. తాలిబాన్‌కు దగ్గరగా ఎందుకు వస్తోంది?
రష్యా.. ఆఫ్గాన్‌లో ప్రస్తుత పాలకులతో బలమైన సంబంధాలను ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తర్వాత.. మాస్కో కాబుల్‌తో మెల్లగా చర్చలు కొనసాగించింది. షోయ్గు ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా సమావేశంలో తాలిబాన్‌తో పూర్తి భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్ ఎందుకు ప్రస్తావనలో ఉంది?
నార్త్ కొరియా అనుభవం దీనికి కారణం. 2024లో మాస్కో-ప్యాంగ్యాంగ్ సైనిక ఒప్పందం కుదిరిన తర్వాత.. నార్త్ కొరియా.. ఉక్రెయిన్ యుద్ధంలో సైనికుల్ని పంపినట్లు సమాచారం. ఆఫ్గాన్‌లో అనుభవజ్ఞులైన యోధులు ఉన్నారు.. వీరు గతంలో యుఎస్, నాటో దళాలతో పోరాడారు. ప్రస్తుతం ఒప్పందంతో ఆప్ఘని సైనికులు కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొనివచ్చని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
-
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?