Site icon NTV Telugu

US-Russia: ట్రంప్ డెడ్‌లైన్‌లు పట్టించుకోం.. రష్యా సీనియర్ అధికారి వెల్లడి

Usrussi

Usrussi

ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. అయినా కూడా పుతిన్ దారిలోకి రాలేదు. అయితే పుతిన్ పగలు మంచిగా మాట్లాడతాడు.. రాత్రైతే మాత్రం ప్రజలపై బాంబులు వేస్తాడని.. అతని ప్రవర్తన నచ్చట్లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం ఆపకపోతే ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. తాజాగా నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుత్తెతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌ను హెచ్చరించారు. 50 రోజుల్లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపకపోతే.. టారిఫ్‌లతో అధిక వడ్డన వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రష్యా మిత్ర దేశాలపై కూడా 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా దారిలోకి రావాలంటే ఇదే మార్గం అని ట్రంప్ భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Harry Potter Reboot: హ్యారీ పోట్టర్ రీబూట్ ప్రారంభం.. కొత్త హ్యారీగా ఎవరంటే..?

ఇక ట్రంప్ హెచ్చరికలపై రష్యా సీనియర్ అధికారి, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ స్పందించారు. ట్రంప్ డెడ్‌లైన్‌లను రష్యా పట్టించుకోదని తేల్చి చెప్పారు. పుతిన్‌ను హంతకుడు, కఠినమైన వ్యక్తి అని పిలవడం తనకు ఇష్టం లేదన్నారు. ఇక ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ ఇంకా స్పందించలేదు. అలాగే ఉక్రెయిన్‌కు ఆయుధాలు కూడా అందిస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: Nidhi Agarwal : పవన్ కల్యాణ్‌ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్

ఉక్రెయిన్‌ పట్ల ట్రంప్ సానుకూలంగా ఉండడంతో ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కీత్‌ కెల్లోగ్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయడం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలపై ఫలప్రదంగా చర్చ సాగినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యాకు సాయం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేలా బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్‌ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్‌ అంగీకరించారని, రికార్డుస్థాయి ఆయుధాలతో పాటు పేట్రియాట్‌ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్‌కు పంపించనున్నారని గ్రాహమ్‌ వెల్లడించారు.

Exit mobile version