Nidhi Agarwal : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రమోషన్లు పెద్దగా చేయట్లేదు గానీ.. మూవీపై బజ్ స్టేబుల్ గానే ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి నిధి అగర్వాల్ ప్రమోషన్లలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమా లేట్ అయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ అసలు రీజన్ వేరే ఉంది. పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో ఉంటూ సినిమా కోసం చాలా టైమ్ ఇచ్చాడు. ఓ వైపు పొలిటికల్ మీటింగ్స్ కు అటెండ్ అవుతూనే షూటింగ్ కు వచ్చారు. చాలా కష్టపడ్డారు. మూవీ కథ చాలా బలంగా ఉంటుంది. అందుకే షూటింగ్ కు ఎక్కువ టైమ్ తీసుకుంది.
Read Also : Kiran Abbavaram : బూతులతో సినిమా.. కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్..
అవి తెలియక చాలా మంది మూవీ గురించి, పవన్ కల్యాణ్ గురించి రకరకాల రూమర్లు క్రియేట్ చేశారు. ఈ సినిమా ఒక విజువల్ వండర్. కానీ ట్రైలర్ కు ముందు చాలా రకాల రూమర్లు వచ్చాయి. మూవీకి అంత సీన్ లేదని.. అందుకే లేట్ అవుతుందని కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్ వచ్చాక వాటన్నింటికీ చెక్ పడింది. సినిమా అద్భుతంగా ఉంటుందనే కామెంట్లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి రూమర్లను ఎప్పుడూ నమ్మకూడదు. అవి మనకు నిజాలను దూరం చేస్తాయి. పవన్ కల్యాణ్ ఐదేళ్ల క్రితం ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టారు. ఇప్పుడు కూడా అదే ఇంటెన్షన్ తో పనిచేస్తున్నారు. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన చాలా హంబుల్ గా ఉంటారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. చూస్తుంటే ఇక నుంచి వరుసగా ప్రమోషన్లలో పాల్గొనేలా ఉంది ఈ బ్యూటీ. ఇక జులై 20న వైజాగ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. ఆ ఈవెంట్ తోనే కావాల్సినంత బజ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు.
Read Also : Danush : ఇడ్లీ కొట్టు మీద తెలుగు డిస్ట్రిబ్యూటర్ల గట్టి పోటీ!