Ukraine Crisis: లిసిచాన్స్క్‌ను స్వాధీనం చేసుకున్నాం.. రష్యా రక్షణ శాఖ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా క్షిపణులతో దాడులు చేస్తుండగా.. పలు దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ మాస్కో సేనలను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌లో కీలకమైన డాన్‌బాస్ ప్రాంతం పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించింది. లూహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శత్రువును పూర్తి స్థాయిలో తరిమి కొట్టి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
North Korea: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. కిమ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
లిసిచాన్స్క్ నగరం చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పూర్తిగా మోహరించి మొత్తంగా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంత నగరమైన ఖార్కీవ్‌లో ఉక్రెయిన్ మిలటరీ స్థావరంపై దాడి చేశామని.. ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని మైకోలేవ్ నగర శివార్లలో ఉన్న విదేశీ విమానాల స్థావరాన్నీ నేలమట్టం చేశామని ప్రకటించింది. రష్యాకు సరిహద్దుగా ఉన్న ఉక్రెయిన్ ప్రాంతం డాన్‌బాస్‌ను పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. డాన్‌బాస్‌లోని లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అక్కడ ఇప్పటికే రష్యా మద్దతుతో వేర్పాటు వాదులు ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలపై పోరాడుతున్నారు. వారితోపాటు రష్యా కూడా పెద్ద సంఖ్యలో దళాలతో కలిసి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటోంది.
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!