Site icon NTV Telugu

Russia: భారత్, చైనాల ముందు మీ బెదిరింపులు పనిచేయవు.. ట్రంప్‌కు రష్యా వార్నింగ్..

Sergei Lavrov

Sergei Lavrov

Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.

Read Also: Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..

రష్యా ఛానల్ 1టీవీ ‘‘ది గ్రేట్ హోమ్’’ కార్యక్రమంలో లావ్రోవ్ మాట్లాడుతూ.. భారత్, చైనా వంటి దేశాలు రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం మానేయాలని అమెరికా చేస్తున్న ఒత్తిడితో దేశాలను ఎలా దూరం చేస్తున్నాయో వివరించారు. ఈ రెండు దేశాలు కొత్త ఇంధన మార్కెట్లు, వేరే చోట కొనుగోలు చేయాలని అమెరికా బలవంతం చేస్తుందని, దీనికి వారు ఎక్కువ చెల్లించవలసి వస్తుందని రష్యన్ మంత్రి అన్నారు. “చైనా, భారతదేశం రెండూ పురాతన నాగరికతలు కలిగిన దేశాలు, అమెరికా బెదిరింపులకు తలొగ్గవు” అన్నారు. నాకు నచ్చనవి చేయడం మానేయాలని, లేదంటే నేను మీపై సుంకాలు విధిస్తానంటే కుదరదని లావ్రోవ్ చెప్పారు.

భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది, దీని ద్వారా వచ్చే డబ్బును రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కారణంగానే, భారత్‌పై ట్రంప్ పరిపాలన 50 శాతం సుంకాలను విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా అత్యధిక సుంకాలను విధించింది.

Exit mobile version