Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లోని డోనెత్స్క్ ప్రాంతంలోని రెండు గ్రామాలను తమ సైన్యం స్వాధీనం చేసుకుంది. సిరెడ్‌నె, క్లెబన్ బైక్ గ్రామాలు ఇప్పుడు రష్యా నియంత్రణలోకి వెళ్లాయని ప్రకటించింది. అంతేకాకుండా రష్యా సైన్యం ఉక్రెయిన్ సైనిక సముదాయంపై దాడులు జరిపినట్టు తెలిపింది. 143 ప్రాంతాల్లో ఉక్రెయిన్ సాయుధ దళాలు, విదేశీ…
Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.