Russia Ukraine War: యుద్ధానికి 3 ఏళ్లు.. 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..
- ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు..
- 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచాయి. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు. అయితే, యుద్ధంలో రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ మాత్రం సర్వనాశనం అయింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచిన సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.
Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
Also Read
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ఉక్రెయిన్ అధికారుల ప్రకారం.. ఖార్కివ్, పోల్టావా, సుమీ, కీవ్, చెర్నిహిల్, మైకోలైవ్, ఒడెసాతో సహా మొత్తం 13 ప్రాంతాల్లో డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిని అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా సమన్వయంతో ఒకేసారి రికార్డ్ స్థాయిలో 267 డ్రోన్లనున ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళ కమాండ్ ప్రతినిధి యూరి ఇగ్నాట్ తెలిపారు. వీటిలో 138 మందిని అడ్డగించగా, 119 డ్రోన్లు జామ్ అవ్వడంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. రష్యా మూడు బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించిందని వెల్లడించారు. ఉక్రెయిన్ లోని 5 ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యుద్ధంలో అతిపెద్ద దాడి అని అన్నారు. గత వారం రష్యా ఉక్రెయిన్‌పై దాదాపు 1150 అటాక్ డ్రోన్లు, 1400 కంటే ఎక్కువ గైడెడ్ ఏరియల్ బాంబులు, వివిధ రకాల 35 క్షిపణుల్ని ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు.
On February 23, 2025, Russia unleashed 267 drones against Ukraine, marking its largest drone assault since the start of the full-scale invasion.
Ukrainian air defenses successfully downed 138 of these drones. 119 imitation drones were lost. Russia must be held accountable. pic.twitter.com/jTduUrKqdt
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) February 23, 2025
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!