Site icon NTV Telugu

Spider Web: ఉక్రెయిన్ గూఢచారిని గుర్తించిన రష్యా.. దేశ వ్యాప్తంగా వేట!

Spiderweb

Spiderweb

రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఏడాదిన్నరగా వేసిన పక్కా ప్రణాళికను ఉక్రెయిన్ అమలు చేసి విజయం సాధించింది. దీంతో ప్రపంచమంతా ఉలిక్కి పడింది.

ఇది కూడా చదవండి: YS Jagan: చంద్రబాబుపై 24 కేసులున్నాయి.. ఆయన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి కొడితే ధర్మమేనా..?

అయితే ఇంత రహస్యంగా ట్రక్కుల్లో డ్రోన్లు ఎలా తరలించగలిగారని రష్యా దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఉక్రెయిన్‌కు గూఢచారిగా వ్యవహరించిన వ్యక్తిని రష్యా నిఘా వర్గాలు గుర్తించినట్లుగా డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని పేర్కొంది. అతడి పేరు ఆర్టమ్ టిమోఫీవ్‌గా నిఘా వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇతడి కోసం దేశ వ్యాప్తంగా నిఘా వర్గాలు గాలిస్తున్నాయి. ఆర్టమ్ టిమోఫీవ్‌ సాయంతోనే ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ చేపినట్లుగా నిర్ధారించింది. ఆర్టమ్ ఉక్రెయిన్‌లో జన్మించాడు. అనంతరం వ్యాపారం పేరిట రష్యాలోని చెల్యాబిన్స్క్ నగరానికి వెళ్లి స్థిరపడ్డాడు. ఇతడే ఆపరేషన్ స్పైడర్ వెబ్‌కు స్లీపర్ సెల్‌లా పని చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.

ఇది కూడా చదవండి: HHVM Pre Release Event: ఫాన్స్ గెట్ రెడీ అమ్మ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?

సెమీ-ట్రక్కులపై ఉన్న చెక్క ఫామ్‌హౌస్‌లు వివిధ ప్రాంతాలకు తరలించాలి ఆర్టిమ్ ప్లాన్ చేశాడు. నాలుగు ట్రక్కులు కూడా ఆర్టిమ్ పేరిటే రిజస్టర్ అయి ఉన్నాయి. ఇందులో ఒక డ్రైవర్‌ను రష్యన్ అధికారులు అదుపులోకి తీసుకోగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆర్టిమ్ సూచనల మేరకే ట్రక్కులు ఎయిర్‌బేస్ సమీపంలోకి తరలించనట్లు చెప్పుకొచ్చాడు. చెక్క ఫామ్‌హౌస్‌ల్లోనే డ్రోన్లు ఉన్నాయి. వీటిని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసి రష్యా బాంబర్లను పేల్చేశారు. మరొక డ్రైవర్ మాట్లాడుతూ.. ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే డ్రోన్లు పైకి ఎగిరిపోయాయని.. ఇదంతా ఆర్టిమ్ సలహా మేరకే జరిగించినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్టిమ్ కోసం రష్యన్ అధికారులు వేటాడుతున్నారు.

Exit mobile version