రష్యాను ఉక్రెయిన్ ఊహించని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో రష్యా వైమానిక స్థావరాలను ఉక్రెయిన్ డ్రోన్లు నాశనం చేశాయి. సెమీ ట్రక్కుల్లో రహస్యంగా తరలించిన 117 డ్రోన్లతో రష్యన్ బాంబర్లను పేల్చేశాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లు, క్షిపణి ప్రయోగాలు చేసింది.