Real Life Joker Kyota Hattori Sentenced 23 Years Of Prison For Killing 13 People: డీసీ కామిక్స్‌లోని ‘జోకర్’ క్యారెక్టర్ తరహాలో ఒక వ్యక్తి జోకర్ వేషం ధరించి.. ఒక ట్రెయిన్‌లో మారణకాండ సృష్టించాడు. మొత్తం 13 మంది వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ కేసులో తొలుత నిందితుడు పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. చివరికి అతని పాపం పండి, పోలీసులకు దొరికాడు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత.. న్యాయస్థానం నిందితుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Malavika Mohnan: 500 కోట్లు అయినా సరే.. అందుకు మాత్రం చచ్చినా ఒప్పుకోను
2021 అక్టోబర్ 31వ తేదీన క్యోటా హట్టోరి (26) అనే ఓ వ్యక్తి జోకర్ వేషం ధరించి, రద్దీగా ఉండే ట్రెయిన్‌లో ఎక్కాడు. ట్రెయిన్ కదిలే వరకు సైలెంట్‌గా ఉన్న అతడు, ట్రెయిన్ కదలగానే ఒక వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు. అతని ఛాతిపై పొడిచాడు. ఆ తర్వాత మరో 12 మంది ప్రయాణికులను చంపేందుకు ప్రయత్నించాడు. రాత్రి 8 గంటల సమయంలో కీయో లైన్ రైలులో లైటర్‌ను వెలిగించి, ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అతడు జోకర్ వేషంలో ఉండటంతో.. నిందితుడు ఎవరో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? అనేది అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది.
Jennifer Mistry: సెట్‌లో అవమానించారు, నీళ్ల కోసం ఆ దుస్థితి.. లైవ్‌లోనే ఏడ్చేసిన నటి
చివరికి.. ఆ నిందితుడికి సంబంధించి ఒక లీడ్ దొరకడంతో, పోలీసులు రంగంలోకి దిగి, క్యోటా హట్టోరిని పట్టుకున్నారు. ఈ రియల్ జోకర్ కేసుని విచారించిన టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు.. నిందితుడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలు ఈ మారణకాండకు ఎందుకు పాల్పడ్డావు? అని అతడ్ని ప్రశ్నించగా.. తనకు చంపాలనిపించి వాళ్లని చంపేశానని షాకింగ్ సమాధానం ఇచ్చాడు. దీంతో కోర్టు సీరియస్ అయ్యి.. అతని ఉద్దేశం ఖండించదగినది, చాలా స్వార్థమైనదిగా పేర్కొంటూ.. కఠిన శిక్ష విధించింది.