Rashid Khan: అనాగరికం.. అనైతికం.. పాకిస్థాన్ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం
- అనాగరికం.. అనైతికం
- పాకిస్థాన్ దుశ్చర్యపై రషీద్ ఖాన్ ధ్వజం పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య అనాగరికం, అనైతికం అంటూ ధ్వజమెత్తారు.

Also Read
పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని రషీద్ ఖాన్ అన్నారు. ప్రపంచ వేదికపై దేశం కోసం ప్రాతినిధ్యం వహించాలని తల్లులు కలలు కన్నారని.. కానీ వారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. మరో అంతర్జాతీయ ఆటగాడు మహ్మద్ నబీ మాట్లాడుతూ.. ‘‘ఈ సంఘటన పాక్టికాకు మాత్రమే కాదు.. మొత్తం ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి.. దేశం మొత్తానికి విషాదం’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుంది.. మరోసారి ట్రంప్ కీలక ప్రకటన
ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో పాకిస్థాన్-శ్రీలంకతో జరిగే త్రి-దేశాల సిరీస్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్థాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్లినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇది పిరికి దాడిగా ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఈ ఘటన తర్వాత ఆప్ఘనిస్థాన్ త్రి-దేశాల సిరీస్ నుంచి వైదొలిగింది.
ఇది కూడా చదవండి: Maithili Thakur: ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా.. అలీనగర్‌లో నామినేషన్ వేసిన మైథిలి ఠాకూర్
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!