Liz Truss: యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్‌ను నియమించిన క్వీన్ ఎలిజబెత్.. బోరిస్ జాన్సన్ రాజీనామా ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen Elizabeth appoints Liz Truss as UK prime minister: యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో రిషి సునక్‌పై గెలుపొందిన లిజ్ ట్రస్.. యూకేకు ప్రధానిగా ఎన్నికయ్యారు. తాజాగా యూకే ప్రధానిగా లిజ్ ట్రస్‌ను క్వీన్ ఎలిజబెత్ నియమించారు. ఇన్నాళ్లు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామాను రాణి ఆమోదించారు. క్వీన్ ఎలిజబెల్ 2 అధికారికంగా లిజ్ ట్రస్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. లిజ్ ట్రస్ మంగళవారం మధ్యాహ్నం స్కాట్లాండ్ లోని బల్మోరల్ కాజిల్‌లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. 70 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ పాలనలో లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్‌లో కాకుండా బాల్మోరల్‌లో అధికారం చేపట్టడం ఇదే తొలిసారి.
Read Also: Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
47 ఏళ్ల లిజ్ ట్రస్ యూకేకు కాబోతున్న మూడో మహిళా ప్రధాని. అంతకు ముందు మార్గరేట్ థాచర్, థెరిస్సామే మాత్రమే ప్రధానులుగా పదవీ బాధ్యతలను చేపట్టారు. సోమవారం ప్రకటించిన తుది ఫలితాల్లో టోరీ నాయకత్వ పోటీలో లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునక్ 60,399 ఓట్లు పొందారు. దాదాపుగా 20 వేల కన్నా ఎక్కువ మెజారిటీతో లిజ్ ట్రస్ గెలుపొందారు. ప్రధానితో పాటు కన్జర్వేటీవ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ తన బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు.
రెండు నెలల క్రితం యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో వరసగా ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ప్రధాని ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొదట్లో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పోటీలో ముందు ఉన్నప్పటికీ.. తర్వాత లిజ్ ట్రస్ పై చేయి సాధించారు. అన్ని సర్వేలు కూడా లిజ్ ట్రస్సే యూకే కొత్త ప్రధాని అవుతారని తెలిపాయి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!