Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..
- హత్యాయత్నం తర్వాత ట్రంప్ కోసం ప్రార్థించిన పుతిన్..
- పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు. ట్రంప్ శ్రేయస్సు కోసం పుతిన్ ప్రార్థనలు చేశారని, ఫాక్స్ న్యూస్ హోస్ట్ టక్కర్ కార్ల్సన్ పాడ్‌కాస్ట్‌లో విట్ కాఫ్ వెల్లడించారు. ఇది ట్రంప్ హత్యాయత్నంపై పుతిన్ ఆందోళనకు నిదర్శనమే కాకుండా, ఇద్దరి మధ్య స్నేహాన్ని కూడా హైలెట్ చేస్తుందని చెప్పారు.
Read Also: Trump: సునీతా విలియమ్స్‌కు ట్రంప్ గిఫ్ట్.. ఓవర్‌టైమ్ జీతం సొంతంగా చెల్లిస్తానని వెల్లడి
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
పుతిన్‌తో తన రెండో మీటింగ్ గురించి విట్కాఫ్ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు తన స్థానిక చర్చిని సందర్శించి, తన ప్రీస్ట్‌ని కలిసి, ట్రంప్ కోలుకోవాలని ప్రార్థించారని చెప్పారు. పుతిన్, ట్రంప్‌తో స్నేహం కలిగి ఉన్నాడని, తన స్నేహితుడి కోసం ప్రార్థించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్‌కి వెల్లడించిన సమయంలో అతను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగి హత్యాయత్నంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి ట్రంప్‌ని చంపాలని చూశాడు. ఈ ఘటనకు ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులే కారణమని క్రెమ్లిన్ ప్రతినిధి ఆరోపించారు.
పుతిన్ తన అగ్రశ్రేణి రష్యన్ కళాకారుడు రూపొందించిన ట్రంప్ అందమైన చిత్రపటాన్ని, ట్రంప్‌కి బహుమతిగా పంచించారు, ఇది పుతిన్-ట్రంప్ మధ్య స్నేహాన్ని నొక్చి చెబుతుంది. అధ్యక్షుడైన తర్వాత పలుమార్లు ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలిచేందుకు చర్చలు జరిపారు. ట్రంప్ పుతిన్‌ని అనేక సందర్భాల్లో ప్రశంసించారు. ఇటీవల, పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ట్రంప్, మోడీ కృషిని కొనియాడారు.
తాజావార్తలు
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?