NTV Telugu Site icon

Putin: ట్రంప్ కోసం చర్చిలో పుతిన్ ప్రార్థనలు.. కారణం ఏంటంటే..

Trump Putin

Trump Putin

Putin: గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటనలో ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కోసం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ చెప్పారు. ట్రంప్ శ్రేయస్సు కోసం పుతిన్ ప్రార్థనలు చేశారని, ఫాక్స్ న్యూస్ హోస్ట్ టక్కర్ కార్ల్‌సన్ పాడ్‌కాస్ట్‌లో విట్ కాఫ్ వెల్లడించారు. ఇది ట్రంప్ హత్యాయత్నంపై పుతిన్ ఆందోళనకు నిదర్శనమే కాకుండా, ఇద్దరి మధ్య స్నేహాన్ని కూడా హైలెట్ చేస్తుందని చెప్పారు.

Read Also: Trump: సునీతా విలియమ్స్‌కు ట్రంప్ గిఫ్ట్.. ఓవర్‌టైమ్‌ జీతం సొంతంగా చెల్లిస్తానని వెల్లడి

పుతిన్‌తో తన రెండో మీటింగ్ గురించి విట్‌కాఫ్ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు తన స్థానిక చర్చిని సందర్శించి, తన ప్రీస్ట్‌ని కలిసి, ట్రంప్ కోలుకోవాలని ప్రార్థించారని చెప్పారు. పుతిన్, ట్రంప్‌తో స్నేహం కలిగి ఉన్నాడని, తన స్నేహితుడి కోసం ప్రార్థించారని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్‌కి వెల్లడించిన సమయంలో అతను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగి హత్యాయత్నంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి ట్రంప్‌ని చంపాలని చూశాడు. ఈ ఘటనకు ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులే కారణమని క్రెమ్లిన్ ప్రతినిధి ఆరోపించారు.

పుతిన్ తన అగ్రశ్రేణి రష్యన్ కళాకారుడు రూపొందించిన ట్రంప్ అందమైన చిత్రపటాన్ని, ట్రంప్‌కి బహుమతిగా పంచించారు, ఇది పుతిన్-ట్రంప్ మధ్య స్నేహాన్ని నొక్చి చెబుతుంది. అధ్యక్షుడైన తర్వాత పలుమార్లు ట్రంప్, పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలిచేందుకు చర్చలు జరిపారు. ట్రంప్ పుతిన్‌ని అనేక సందర్భాల్లో ప్రశంసించారు. ఇటీవల, పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ట్రంప్, మోడీ కృషిని కొనియాడారు.