NTV Telugu Site icon

Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.. రష్యా వెల్లడి

Trumpputin

Trumpputin

అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి ట్రంప్‌.. పుతిన్‌తో ఫోన్‌‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. దీనిపై రష్యా తాజాగా స్పందించింది. ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని.. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని రష్యా కొట్టిపారేసింది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఒక్క రోజులో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ ట్రంప్ భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ మాట్లాడినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ సమాచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం స్పస్టం చేశారు. రష్యా-యూఎస్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే

ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్‌ అభినందనలు తెలిపారు. ట్రంప్‌ ధైర్యవంతుడు అని.. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ సూచనను గతంలో క్రెమ్లిన్‌ స్వాగతించింది.

ఇది కూడా చదవండి: Sleep Important: దీర్ఘాయువుగా జీవించాలంటే మంచి నిద్ర తప్పనిసరంటున్న పరిశోధనలు