Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.. రష్యా వెల్లడి
- ట్రంప్.. పుతిన్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు
- రష్యా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించాలంటూ పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. దీనిపై రష్యా తాజాగా స్పందించింది. ట్రంప్-పుతిన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని.. ఆ వార్తలన్నీ పూర్తి అవాస్తవమని రష్యా కొట్టిపారేసింది. రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.

Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఒక్క రోజులో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తాను యుద్ధాన్ని ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానంటూ ట్రంప్ భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ మాట్లాడినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా ఈ సమాచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సోమవారం స్పస్టం చేశారు. రష్యా-యూఎస్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood : యంగ్ హీరోలతో రొమాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ వీరే
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్‌కు పుతిన్ అభినందనలు తెలిపారు. ట్రంప్ ధైర్యవంతుడు అని.. ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ సూచనను గతంలో క్రెమ్లిన్ స్వాగతించింది.
ఇది కూడా చదవండి: Sleep Important: దీర్ఘాయువుగా జీవించాలంటే మంచి నిద్ర తప్పనిసరంటున్న పరిశోధనలు
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!